వైరా: ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 128 కేజీల గంజాయిని వైరా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైరాలో శుక్రవారం ఏసీపీ సారంగపాణి వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐ పుష్పాల రామారావు, సిబ్బందితో కలిసి సోమవరం ఆంజనేయస్వామి ఆలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గోనె బస్తాలతో ద్విచక్రవాహనాలపై వస్తున్న ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఆపి సంచుల్లో పరిశీలించగా 64 ప్యాకెట్లలో ఉన్న 128 కేజీల గంజాయి బయటపడింది. ఒడిశాలోని మల్కాన్‌గిరి రాబాకాలనీకి చెందిన మనుయాల్ బోత్రా, కమర్గూడా గ్రామానికి చెందిన లక్ష్మణ్ కేలో, ఏపీలోని అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన చిటికల సన్యాసినాయుడు కలిసి ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. సమావేశంలో సీఐ వెంకటప్రసాద్, ఎస్‌ఐ పి.రామారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
నల్లమందు, ఎండు గంజాయి..
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఖమ్మం – వరంగల్ మార్గంలో నల్లమందు, ఎండుగంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏసీఎం (నల్లమందు), గంజాయి వినియోగం, అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారంతో ఉద్యోగులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు రాజస్థాన్‌కు చెందిన రన్వీర్‌సింగ్ వద్ద నల్లమందు, ఎండు గంజాయి లభ్యమైంది. ఆయన మూత్రం శాంపిళ్లు పరీక్షించగా పాజిటివ్‌గా తేలడమే కాక, అక్కడే ఉన్న గుర్రాలపాడు వాసి ఎస్‌కే కరీంపాషా కూడా గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు నిందితులపై చర్యల నిమిత్తం ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–2లో అప్పగించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది జమాల్‌షరీఫ్, తిరుపతి, వీరబాబు, ప్రసన్నకుమార్, జాయిరాం, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఒడిశా నుంచి తమిళనాడుకు
తరలిస్తున్న నిందితులు


