సింగరేణి వైద్యుల నియామకంలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

సింగరేణి వైద్యుల నియామకంలో జాప్యం

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

రుద్రంపూర్‌: సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యుల నియామకంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోంది. స్పెషలిస్ట్‌ వైద్యుల కొరతను తీర్చేందుకు సంస్థ వ్యాప్తంగా 32 ఖాళీలను భర్తీ చేసేందుకు గత డిసెంబర్‌లో యాజమాన్యం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ ఉన్నతాధికారులు, సీనియర్‌ వైద్యాధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటివరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. కాగా 32 పోస్టులకు 74 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. జనరల్‌ సర్జన్‌–4, గైనకాలజిస్ట్‌–7, పీడియాట్రీషియన్‌–4, చెస్ట్‌ ఫిజీషియన్‌–3, ఈఎన్‌టీ సర్జన్‌–2, అనష్థీసియన్‌– 7, పెథాలజిస్ట్‌–1, హెల్త్‌ ఆఫీసర్‌–3, సైక్రియాట్రిస్ట్‌–1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి పోస్టులు భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement