కథారచనల్లో మెళ కువలు నేర్పుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

కథారచనల్లో మెళ కువలు నేర్పుతున్నా..

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

కథారచనల్లో మెళ కువలు నేర్పుతున్నా..

ఆంగ్ల మాధ్యమ విద్యాప్రభావంతో మాతృభాషకు ప్రాధాన్యత తగ్గుతున్న నేటి తరుణంలో మాతృభాష అయిన తెలుగు ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా విద్యార్థులతో కథలను విరివిగా చదివించడమే కాక, కథా కార్యశాలల ద్వారా కథా రచనలో మెళకువలను నేర్పించి విద్యార్థులే స్వయంగా కథలు రాసేలా ప్రోత్సహిస్తున్నా. ఆ ప్ర యత్నంలో భాగంనే గత ఏడాది మా పాఠశాల విద్యార్థి ఆవుల పోతురాజు రాసిన కథలతో ‘నాన్నే నా హీరో’ కథా సంకలనం వెలువడింది. అలాగే శతక సాహిత్యంలో పేరెన్నికగన్న వేమన శతకాన్ని నేర్పించి బాల అవధాన కార్యక్రమాన్ని నిర్వహించాం. మున్ముందు వివిధ ప్రక్రియల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని భా విస్తున్నాం. ఇందుకు సహకరిస్తున్న పాఠశాల హెచ్‌ఎం, గార్లపాటి–బొల్లేపల్లి ట్రస్ట్‌ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. – సత్తుపల్లి టౌన్‌

Advertisement
 
Advertisement
Advertisement