విద్యార్థులు, ప్రయాణికుల
కష్టాలకు చెక్
ఆరు కొత్త రూట్లలో నేటి నుంచి
సర్వీసులు
మరికొన్ని పాత రూట్లలో కూడా
పునరుద్ధరణ
ప్రయాణికుల సౌకర్యం కోసం..
నూతన సర్వీసుల వివరాలు..
ఖమ్మం నుంచి బోనకల్ వెళ్లే ప్రయాణికుల కోసం నాగులవంచ, రామాపురం, గార్లపాడు, రావినూతల మీదుగా కొత్త సర్వీసు మొదలుకానుంది. ఈ బస్సు బోనకల్ నుంచి ఉదయం 8 గంటలకు మొదలై రామాపురం నుంచి ఖమ్మం చేరుకుంటుంది. సాయంత్రం 4.15 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి ఇదే మార్గంలో బోనకల్ వెళ్తుంది. అలాగే, ఖమ్మం – పందిళ్లపల్లి – మత్కేపల్లి మీదుగా గంధసిరి గ్రామానికి కొత్త సర్వీ సు ప్రారంభిస్తున్నారు. ఖమ్మం నుంచి ఉదయం 7.15, మధ్యాహ్నం 3.40 గంటలకు మొదలయ్యే ఈ బస్సులు, గంధసిరి నుంచి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి.
పునరుద్ధరించిన సర్వీసులు
ప్రయాణికుల వినతితో పెద్దమండవ, చిన్నమండవ చింతకాని, పమ్మి గ్రామాలకు గతంలో నడిచిన బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. ఖమ్మం నుంచి ఉదయం 8.30, సాయంత్రం 4.30 గంటలకు పెద్దమండవకు బస్సులు మొదలవుతాయి. అలాగే, పెద్దమండవ నుంచి ఉదయం 9.50, సాయంత్రం 5.30 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాయి. అంతేకాక చిన్నమండవకు ఖమ్మం నుంచి ఉదయం 8.55 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, చిన్నమండవ నుంచి ఉదయం 10.05 గంటలకు, రాత్రి 7.40 గంటలకు బస్సులు మొదలవుతాయి. ఖమ్మం నుంచి చింతకానికి ఉదయం 7 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు, చింతకాని నుంచి ఖమ్మంకు ఉదయం 8, సాయంత్రం 5.30 గంటలకు బస్సులు ఉంటాయి. అలాగే, ఖమ్మం నుంచి పమ్మికి ఉదయం 7.55 గంటలకు, సాయంత్రం 4.25 గంటలకు.. తిరుగు ప్రయాణంలో పమ్మి నుంచి ఉదయం 8.55, సాయంత్రం 5.30 గంటలకు బస్సులు బయలుదేరతాయి.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఖమ్మం ఆర్టీసీ డిపో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా నూతన సర్వీసుల ఏర్పాటుకు నిర్ణయించారు. అంతేకాక గతంలో నిలిచిపోయిన సర్వీసులను సైతం పునరుద్ధరించనున్నారు. విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళలకు బస్సుల షెడ్యూల్ రూపొందించగా సోమవారం నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
– ఖమ్మంమయూరిసెంటర్
గ్రామాల్లోని విద్యార్థులు, సామాన్య ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త సర్వీసు లు ఏర్పాటు చేయడమే కాక పాత సర్వీసులను పునరుద్ధరించాం. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులే కాక రైతు లు, చిరువ్యాపారులు నగరానికి వచ్చి వెళ్లడం సులభమవుతుంది. ప్రజలు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకుని సంస్థకు సహకరించాలి.
–శివప్రసాద్, డీఎం, ఖమ్మం


