●కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లు | - | Sakshi
Sakshi News home page

●కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లు

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

ఇల్లెందురూరల్‌: అటవీ శాఖ ఇల్లెందు రేంజ్‌లో ఇస్లావత్‌ సత్యవతి బీట్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అడవిలో విధులు నిర్వర్తించడం, స్తూనే వన్యప్రాణుల నుంచి కాపాడుకోవడం, అటవీ సంపదను రక్షించడం ఒక మహిళకు కత్తిమీద సామే. అయినా అలాంటి విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న సత్యవతి కుటుంబాన్ని సైతం చక్కగా తీర్చిదిద్దుకుంటోంది. ఉదయమే విధులకు హాజరయ్యేందుకు తాను సిద్ధమవుతూనే పాఠశాలకు వెళ్లే పిల్లలను సిద్ధం చేస్తుంది. ఇలా ఒకే సమయంలో పిల్లలు, వ్యవసాయ పనులకు వెళ్లే భర్త మనోజ్‌ను సిద్ధం చేసి తాను విధులకు హాజరవుతోంది. రోజంతా విధుల్లో శ్రమించినా సాయంత్రం ఆ అలసట తనలోనే దాచుకొని పిల్లలను చదివిస్తూ నిర్ధేశించుకున్న లక్ష్యం దిశగా భర్త సహకారంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎంత కష్టం ఎదురైనా కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లలా భావిస్తానని సత్యవతి చెబుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement