ఐదెకరాల భూమి.. రూ.కోటి విరాళం | - | Sakshi
Sakshi News home page

ఐదెకరాల భూమి.. రూ.కోటి విరాళం

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

చింతకాని: చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో శ్రీ సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యాన శ్రీ సత్యసాయి ప్రేమామృత విద్యాల యం, ప్రకృతి వైద్యాలయం ఏర్పాటుకు శని వారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవాసంస్థల జిల్లా బాధ్యులు మాట్లాడుతూ విద్యాలయంలో కేజీ నుంచి పీజీ వరకు మానవతా విలువలతో కూడిన ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. అంతేకాక కంప్యూటర్‌ విద్య, అగ్రిటెక్‌లో శిక్షణ కూడా ఉంటుందన్నారు. కాగా, విద్యాలయం ఏర్పాటుకు నాగులవంచ గ్రామానికి చెందిన చల్లా కోటయ్య ఐదెకరాల భూమి, నిర్మాణానికి సేవాసంస్థల మహబూబాబాద్‌ జిల్లా కన్వీనర్‌ మాధవరపు నాగేంద్ర రూ.కోటి విరాళంగా అందజేశారని తెలిపారు. అనంతరం పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. నాగులవంచ, సీతంపేట సర్పంచ్‌లు నారగాని రాంబాయి, ఆళ్ల మణి, వీవీసీ సంస్థల చైర్మన్‌ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌, మత్కేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంబటి వెంకటేశ్వరరావు, ఎన్‌ఆర్‌ఐ బయ్యన బాబూరావు, సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షుడు దమ్మాలపాటి సుధాకర్‌తో పాటు వంగవేటి భాస్కర్‌రావు, భిక్షమయ్య గురూజీ, సభ్యులు పాల్గొన్నారు.

నాగులవంచలో

సత్యసాయి విద్యాలయానికి భూమిపూజ

Advertisement
 
Advertisement
Advertisement