తల్లిదండ్రుల వద్దకే ఉపాధ్యాయులు! | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల వద్దకే ఉపాధ్యాయులు!

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

కొణిజర్ల: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో షెడ్యూల్‌ ప్రకారం గురువారం తల్లిదండ్రుల నిర్వహించాల్సి ఉండగా మండలంలోని సింగరాయపాలెం పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమావేశానికి ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. దీంతో జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ పెసర ప్రభాకరరెడ్డి, సర్పంచ్‌ వేము నాగరాజు, ఉపసర్పంచ్‌ సురభి కృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ జహీద, హెచ్‌ఎం కె.లక్ష్మీనారాయణ ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. కారణమేమిటని ఆరా తీయగా గ్రామస్తులు ఎక్కువ మంది ఉపాధి హామీ పనులకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులే ఊరి చివరి ఫీడర్‌ఛానల్‌ పూడికతీత పనుల వద్దకు వెళ్లారు. అక్కడే తల్లిదండ్రులతో సమావేశమై తమ పాఠశాలలో విద్యార్థుల ప్రగతి, అందుతున్న బోధన అంశాలను వివరించారు.

ఉపాధి హామీ పని ప్రదేశంలో సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement