కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు.. | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు..

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

కొణిజర్ల: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని గురువారం మిల్లులకు తరలిస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్‌చార్జ్‌ మేనేజర్‌ సునీల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని లాలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తహసీల్దార్‌ ఎన్‌.అరుణ, ఏఓ డి.బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించాక క్వింటాకు 10 కేజీల తరుగు కింద తీస్తున్నారని, అందుకు ఒప్పుకుంటేనే మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. అంతేకాక దిగుమతి ఆలస్యమైన లారీల అద్దె కూడా తమపైనే వేస్తున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచి సరిపడా లారీలు సమకూర్చాలని కోరగా సునీల్‌రెడ్డి ప్రతీ బస్తా మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement