●సమన్వయంతో సంతోషం | - | Sakshi
Sakshi News home page

●సమన్వయంతో సంతోషం

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

::.. తడికెళ నవ్యజ్యోతి, కేఎంసీ డీఈ

ఖమ్మంమయూరిసెంటర్‌: ఇంట్లో గృహిణిగా, అమ్మగా, ఉద్యోగినిగా పలువురు మహిళలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారని ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డీఈ తడికెళ నవ్యజ్యోతి వెల్లడించారు. కుటుంబంపై ప్రేమ, సమాజంపై బాధ్యతే మహిళా ఉద్యోగులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే తాను కుటుంబంతో, బాధ్యతల పరంగా కార్యాలయంలో సజావుగా పని చేయగలుగుతున్నానని చెప్పారు. విధుల నిర్వహణ సమయాన అక్కడి సమస్యలే తన దృష్టిలో ముఖ్యమని, ఇంటికి వెళ్లాక మాత్రం పిల్లలు, భర్త, కుటుంబమే సర్వస్వమని తెలిపారు. ఇలా ప్రతీఒక్కరూ రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చని వెల్లడించారు. ‘అమ్మ’ అనే పదంలో అపారమైన ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత దాగి ఉన్నాయని.. ప్రతీ కుటుంబానికి అమ్మ ఒక బలమైన ఆధారమని చెప్పారు. తాను సైతం ఆమె స్ఫూర్తితోనే ఉద్యోగం, కుటుంబ జీవనంలోనూ రాణిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement