రద్దు బాధాకరం | - | Sakshi
Sakshi News home page

రద్దు బాధాకరం

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

రద్దు బాధాకరం నిరాశకు గురయ్యా.. సమగ్ర విచారణ జరిపించాలి లీకై న ప్రాంతంలోనే పరీక్ష నిర్వహించాలి ●

నీట్‌లో మంచి మార్కులు వస్తాయనే నమ్మకంతో ఉన్నా. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే అటు ఇంటర్‌, ఇటు నీట్‌కు సిద్ధమయ్యాం. పేపర్‌ లీక్‌ అయిందని పరీక్ష రద్దు చేయడంతో వేదనకు గురయ్యా. భవిష్యత్‌లోనైనా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.

– హారికారెడ్డి, రెజొనెన్స్‌ కళాశాల, ఖమ్మం

నీట్‌ రద్దయినట్లు తెలిసి బాధ కలిగింది. పరీక్ష చాలా బాగా రాయడంతో మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. మరో రాష్ట్రంలో పేపర్‌ లీకేజీతో ఇంకోసారి పరీక్ష రాయాల్సి రావడం ఇబ్బందే. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి.

– కె.గుణశేషు, న్యూవిజన్‌ కళాశాల విద్యార్థి, ఖమ్మం

ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎన్‌టీఏ పరీక్ష నిర్వహించగా.. పేపర్‌ లీకేజీ కావడంపై సమగ్ర విచారణ జరిపించాలి. లీకేజీ వ్యవహారంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడుతోంది. ఈ అంశంపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – ఇటికల రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు

దేశమంతా కాకుండా పేపర్‌ లీకై న ప్రాంతాల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. ఏడాది పాటు విద్యార్థులు కష్టపడి చదివినందున ఈ నిర్ణయం తీసుకోవాలి. అంతటా రద్దు చేస్తే ఇబ్బంది పడతారు. గతంలో మంచిగా రాసిన వారు మళ్లీ అలా రాయగలరా అనేది చెప్పలేం. – డాక్టర్‌ రాజశేఖర్‌గౌడ్‌, డీసీహెచ్‌ఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement