సీటీజీ ఆధ్వర్యాన వినూత్నంగా
మాతృదినోత్సవం
ఖమ్మంఅర్బన్: అవకాయతో తెలుగు వారి అనుబంధం మరువలేనిదని వక్తలు పేర్కొన్నారు. ఖమ్మం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) సభ్యులు మాతృదినోత్సవం సందర్భంగా ‘అమ్మ – ఆవకాయ – ఆదివారం’పేరిట వరంగల్ క్రాస్ రోడ్డులోని విజయలక్ష్మి – మహేశ్‌బాబు ఇంట్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మానుకొండ జ్యోతి, షేక్ కై సర్, కొణిదెన శ్రీనివాస్ సంధానకర్తలుగా వ్యవహరించగా 50 మంది సభ్యులు పాల్గొని 50 కిలోల పచ్చడి సామూహింగా తయారు చేశారు. సూర్యాపేట జెడ్పీ సీఈఓ దేవరపల్లి శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్లలో పనులు చేస్తూ నలుగురు కుమారులను ఉన్నతస్థాయికి చేర్చిన కేస్లా లక్ష్మి తదితరులను సన్మానించారు.


