పాల్వంచరూరల్: మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మగుడి) సమీపాన సంతానం లేని మహిళ భక్తులు ఊయ్యాలతొట్టి కట్టే 63 ఏళ్ల నాటి వృక్షం (రావిచెట్టు) గాలివానకు శనివారం రాత్రి నేలకూలింది. ఈ చెట్టు కొమ్మలు ఆలయ ప్రాంగణంలో రేకులషెడ్‌పై పడడంతో దెబ్బతిన్నాయి. ఆలయం వద్ద1963లో నాటిన వేప, రావిచెట్లు మహావృక్షాలుగా ఎదిగాయి. రెండూ కలిసి ఉండడంతోఅశ్వాత్థామ వృక్షంగా భావించి ఏటా అశ్వత్థామకల్యాణం నిర్వహిస్తారు. ఈ వృక్షం చుట్టూభక్తులు ప్రదక్షిణలు చేసేందుకు ప్రత్యేక గద్దె,చుట్టూ స్టీల్ రెయిలింగ్ నిర్మించారు. శనివారంరాత్రి భారీగా గాలివానకు వృక్షం నేలకూలింది. వేపచెట్టు మాత్రం అలాగే ఉంది. చెట్టు కొమ్మలు పడటంతో షెడ్ కొంతభాగందెబ్బతిన్నది. స్టీల్ రెయిలింగ్ ఒకవైపు విరిగిపోయింది. అంతేకాక విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే, రాత్రి కావడంతోఎవరూ లేకపోగా పెనుప్రమాదం తప్పినట్లయింది.


