ఎప్‌సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్‌లతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. రాష్ట్రస్థాయిలో బి.సాయి చరణ్ 8వ ర్యాంక్ సాధించగా, ఎల్.అక్షయ గుణ 60వ ర్యాంక్‌తో అగ్రస్థానాన నిలిచారన్నారు. అలాగే, ఎం.అక్షర 85వ ర్యాంక్, ఎం.వర్ష 148, కె.మణిశంకర్ 204, ఎస్.శ్రీనిధి 244, పి.అర్షిత 290, కె.హాసిని 341, డి.సాయి ప్రణవ్ 374, బి.శ్రీనిధి 377, వి.స్నేహిత 482, ఎం.అమాన్ శ్రీసాయి 525, జి.గీతిక 560, ఎనమన్మోయి 629, వై.హాషిష్ 639, ఎన్.భార్గవ్ 677, బి.ప్రణయ్ 715వ ర్యాంక్ సాధించారన్నారు. ఇంకా 100 లోపు ముగ్గురు, 500లోపు 11 మంది, వేయి లోపు 25మంది, 2వేల లోపు 42మంది, 5వేల లోపు 108 మంది ర్యాంక్‌లు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్‌తో పాటు అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, డీజీఎం చేతన్, డీన్లు వర్మ, జె.కృష్ణ, ఏజీఎంలు బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ అభినందించారు.


