రేపు మాక్‌ ఎక్సర్‌రైజ్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు మాక్‌ ఎక్సర్‌రైజ్‌

May 17 2026 12:12 AM | Updated on May 17 2026 12:12 AM

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం శ్రీనగర్‌కాలనీ రోడ్డు నంబర్‌–5కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నవీన్‌ బ్యాంక్‌ ఖాతాల నుంచి సుమారు రూ.లక్ష నగదును సైబర్‌ నేరగాళ్లు స్వాహా చేశారు. ఆయనకు ఉన్న రెండు ఖాతాల నుంచి నగదు డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో అప్రమత్తమయ్యారు. సైబర్‌ నేరగాళ్లే ఈ పనికి పాల్పడినట్లు భావిస్తూ ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌ తెలిపారు.

ఖమ్మంసహకారనగర్‌: వరదలు, ఇతర ప్రమాదాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై ప్రణాళిక కోసం సోమవారం మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన పలు శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. సోమవారం ఉదయం 8 గంటలకు మాక్‌ ఎక్సర్‌సైజ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాల దృష్ట్యా మున్నేటి వరదలు లేదా ఇతర విపత్తులు ఎదురైనప్పుడు యంత్రాంగం స్పందించాల్సిన తీరుపై మాక్‌ ఎక్సర్‌సైజ్‌ ఉంటుందని తెలిపారు. ఎస్‌ఐలు ఎ.విశ్వతేజ, పి.వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైస్‌ మిల్లును తనిఖీ చేసిన డీసీఎస్‌ఓ

ముదిగొండ: మండలంలోని వనంవారికిష్టాపురంలో రైస్‌మిల్లును డీసీఎస్‌ఓ చందన్‌కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. మేడేపల్లికి చెందిన రైతు ఊటుకూరు సైదులు సదరు మిల్లులో క్వింటా ధాన్యానికి ఏడు కిలోల తరుగు తీస్తున్నారని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో డీసీఎస్‌ఓ విచారణ చేపట్టారు. ధాన్యం తూర్పార పట్టాకే తీసుకురావాలని చెప్పామే తప్ప తరుగు తీయలేదని మిల్లు యజమాని బదులిచ్చాడు. ఆ తర్వాత రైతు వాంగ్మూలం కూడా సేకరించిన డీసీఎస్‌ఓ, రైతులను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. సివిల్‌ సప్లయీస్‌ డీటీ నాగలక్ష్మి, ఆర్‌ఐ కల్యాణి, జీపీఓ బాలకృష్ణ పాల్గొన్నారు.

ఖాతా నుంచి

రూ.లక్ష స్వాహా

సీపీ కార్యాలయం ఎదుట హల్‌చల్‌

ఖమ్మంక్రైం: మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు శనివారం హడావుడి చేశాడు. ప్రకాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పందిరి శివ కొంతకాలంగా భార్యతో గొడవపడి దూరంగా ఉంటున్నాడు. ఈనేపథ్యాన తననెవరూ పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ మద్యం మత్తులో వచ్చిన ఆయన ఒంటిపై పెట్రోల్‌ పోసుకోన్నాడు. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అడ్డుకోబోగా వారిపైనా దురుసుగా ప్రవర్తించాడు. ఈమేరకు శివను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ సీఐ మోహన్‌బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement