12 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

12 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

చింతకాని: మండలంలోని సీతంపేటకు చెందిన రైతులు పోలూరి పుల్లారావు, మోహన్‌రావు, మాగు నూరి కొండల్‌రావు 12 ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఆదివారం అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. సమీప రైతులు చేన్లలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడుతూ మోహన్‌రావు, కొండల్‌రావు మొక్కజొన్న పంటకు వ్యా పించాయి. ఈ విషయమై సమాచారం తెలిసి రైతు లు వెళ్లేలోగా రూ.10లక్షల విలువైన పంట కాలిపోయిందని వాపోయారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.

పిండిప్రోలు కళాశాలలో

ఫర్నిచర్‌ నిధులు స్వాహా?

తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫర్నిచర్‌ కొనుగోలు సందర్భంగా నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ నిధులను అక్రమంగా డ్రా చేశారని పలువురు విమర్శిస్తున్నా రు. ఈ విషయమై 9న తిరుమలాయపాలెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ స్వాతి ఫిర్యాదు చేశారు. ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వ్యక్తి బదిలీపై వెళ్లే సమయాన ఖాళీ చెక్కు లపై సంతకాలు చేయించుకొని సుమారు రూ.10 లక్షలు డ్రా చేసి సొంతానికి వాడుకున్నారని తెలిపారు. పాత ఫర్నిచర్‌, ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఉన్నా కొత్త వస్తువులను ఎక్కువ ధరతో కొనుగోలు చేసి కమీషన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన మంత్రి నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

విద్యుదాఘాతంతో

పాడి గేదెలు మృతి

సత్తుపల్లి: మండలంలోని కాకర్లపల్లిలో విద్యుదాఘాతం కారణంగా ఆదివారం రెండు పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. గ్రామ రైతు పువాళ్ల ప్రసాద్‌ కు చెందిన రెండు పాడి గేదెలు మేతకు వెళ్తూ ఇంటికి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకాయి. దీంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. రూ. 1.50 లక్షల విలువైన పాడిగేదెలు మృతి చెంది నందున తనను ఆదుకోవాలని రైతు ప్రసాద్‌ కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement