ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో సహకరిస్తామని ఏసీపీ రమణమూర్తి, ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం తెలిపారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని శుక్రవారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహించగా ఏసీపీ మాట్లాడుతూ సంకల్ప ఆధ్వర్యాన పిల్లల కోసం పలుమార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్‌లోనూ సహకరిస్తామని చెప్పారు. ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం మాట్లాడుతూ తలసేమియా జన్యుపరమైన వ్యాధి అని, దీనిని దృష్టిలో పెట్టుకుని గర్భిణులే కాక పెళ్లి చేసుకునే వారు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏఆర్ ఏసీపీ నర్సయ్య మాట్లాడగా చిన్నారులు ప్రదర్శించిన ‘వివాహనికి ముందు హెచ్‌బీఏ2 టెస్ట్’ స్కిట్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు రక్తదానం, చికిత్సకు ఆర్థికసాయం చేసిన దాతలను సత్కరించారు. సంస్థ ఫౌండర్ ప్రొద్దుటూరి అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైద్యులు డి.నారాయణమూర్తి, సతీష్ నారాయణచౌదరి, మానస, జి.సుజాతరాణి, బీవీఎన్.కృష్ణ, నరేష్, లక్ష్మీదీప, శ్రావణి, ద్రౌపది, పి.పావని, పి.రవిచందర్, పి.ఉదయ్ భాస్కర్, పి.వంశీకిరిటీ, పి.ప్రియ, అనురాధ పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేయగా, యుగంధర్‌తో పాటు ప్రదీప్‌కుమార్ రక్తదానం చేశారు. అలాగే, ‘యువం ఫౌండేషన్’ సభ్యులు 50 మంది రక్తదానం చేశారు. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు రెహనా బేగం, కోటేశ్వరరావుతో పాటు కూరపాటి ప్రీతి, సనాఉల్లా, సిద్ధార్థ్, నరేష్, అభిషేక్, మల్లేష్, నజీర్, మోతీలాల్, సిరాజ్, సుచరిత, లక్ష్మి, సుగుణ, నిర్మల పాల్గొన్నారు.
ఏసీపీ రమణమూర్తి,
ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం


