ఖమ్మంక్రైం: ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్‌వెస్ట్‌మెంట్ పేరిట నమ్మించి రూ.కోటి మేర మోసం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలి పారు. జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్‌కు ప్రకటన పంపించి, ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు నమ్మించారు. దీంతో ఆమె ముందుకు రాగా ట్రేడింగ్ లింక్‌ల ద్వారా సుమారు రూ.కోటి మేర సైబర్ నేరస్తులు కాజేశా రు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి, ఆమె ఖాతా నుంచి రూ.13లక్షలు ఏపీలోని మొగల్తూరుకు చెందిన కడలి చంద్రశేఖర్ ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీతో పాటు సీఐ రవికుమార్, ఎస్‌ఐలు రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్, సిబ్బందిని సీపీ సునీల్‌దత్ అభినందించారు.


