మరింత వేగంగా అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

మరింత వేగంగా అభివృద్ధి పనులు

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. మధిరలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన ఆమె అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా చేపట్టడమే కాక నాణ్యత లోపించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పనుల సమయాన ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించాలని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామినేని సుజాత రామనాథం, కమిషనర్‌ సంపత్‌ కుమార్‌, నాయకులు, కౌన్సిలర్లు మిర్యాల వెంకటరమణ గుప్తా, వేమిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, పారుపల్లి విజయకుమార్‌, తలుపుల వెంకటేశ్వర్లు, బాణావత్‌ వెంకటరమణ నాయక్‌, యన్నం కోటేశ్వరరావు, దోర్నాల రవికుమార్‌, బండారు నరసింహారావు, మైలవరపు చక్రి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement