సీహెచ్‌పీలో సిగ్నలింగ్‌ విధానం | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌పీలో సిగ్నలింగ్‌ విధానం

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

సత్తుపల్లిరూరల్‌: సింగరేణి సత్తుపల్లి ఏరియా జేవీఆర్‌ కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌లో సిగ్నలింగ్‌ టెలీ కమ్యూనికేషన్‌ సిస్టంను ఏర్పాటుచేశారు. జీఎంలు చింతల శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి ఈ విధానాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌లో ఏర్పాటుచేసిన ఈ విధానం ద్వారా వ్యాగన్లలో బొగ్గు లోడింగ్‌, రవాణా పారదర్శకంగానే కాక వేగంగా జరుగుతుందని తెలిపారు. లోడింగ్‌ మొదలు గమ్యానికి వ్యాగన్లు చేరే వరకు పర్యవేక్షించడం సులువవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు రామకృష్ణ, శ్రీనివాస్‌, సోమశేఖర్‌రావు, సునీల్‌వర్మ, రాజేశ్వరరావు, రవికుమార్‌, సూర్యప్రకాష్‌, కోటి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement