‘వన్‌ మినిట్‌ రూల్‌’తో భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

‘వన్‌ మినిట్‌ రూల్‌’తో భద్రతకు ప్రాధాన్యం

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

హన్మకొండ అర్బన్‌: విద్యుత్‌ సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీజీఎన్పీడీసీఎల్‌లో ‘వన్‌ మినిట్‌ రూల్‌’ అమలు చేస్తున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు సిబ్బంది ఒక్క నిమిషం పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనికి ముందు లైన్‌ క్లియర్‌ పొందడం, ఇండక్షన్‌ టెస్టర్‌తో లైన్‌లో విద్యుత్‌ లేదని నిర్థారించుకోవడం, పీపీఈ కిట్లు ధరించడం, ఎర్తింగ్‌ ఏర్పాటు, డబుల్‌ ఫీడింగ్‌ లేకుండా చూడడం, పరికరాల భద్రతను పరిశీలించడం వంటి అంశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ విధానంతో విద్యుత్‌ ప్రమాదాలు తగ్గించి సిబ్బంది ప్రాణాలు రక్షించడమే లక్ష్యమని తెలిపారు. ‘ఒక్క నిమిషం ఆలోచన – జీవితాంతం భద్రత’అనేదే ‘వన్‌ మినిట్‌ రూల్‌’ప్రధాన సందేశమని సీఎండీ వరుణ్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement