భద్రాచలంటౌన్: భద్రగిరి క్షేత్రంలో గోదావరి నదీ తీరం భక్తి పారవశ్యంతో పులకించింది. శ్రీ సీతా రామచంద్రస్వామి వారి సన్నిధిలో ప్రవహిస్తున్న పుణ్య గౌతమికి ఆదివారం నిర్వహించిన నదీహారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తొలుత గణపతి పూజ నిర్వహించి, అనంతరం దీపోత్సవం చేపట్టారు. భక్తులు వెలిగించిన దీపాలతో గోదావరి మాతకు, శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. చిన్నారుల భరత నాట్య ప్రదర్శన అలరించింది. కుంచాల రాజశేఖర్ దంపతులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ సభ్యులు పూజా సామగ్రిని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామవజ్జుల రవికుమార్, సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, ఫణికుమార్ శర్మ, తేజశర్మ, కృష్ణశర్మ పాల్గొన్నారు.


