బాహ్య ప్రపంచానికి దూరంగా, ప్రకృతి ఒడిలో పెరిగే కొండరెడ్డి చిన్నారుల జీవనశైలికి ఈ చిత్రం అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు ఆడుకోవడానికి అనేక సౌకర్యాలు, సామగ్రి అందుబాటులో ఉంటాయి. కానీ కొండరెడ్ల చిన్నారులు మాత్రం అవేమీ లేక మేకపిల్లలతో ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇదే సమయాన పెద్దలంతా పనికి వెళ్తే వీళ్లే మేకల పిల్లలను సంరక్షిస్తున్నట్లవుతుంది. అశ్వారావుపేట మండలంలోని కొండరెడ్ల గ్రామమైన గోగులపూడిలో ఈ దృశ్యం కనిపించింది.
– అశ్వారావుపేటరూరల్


