హలీడే ట్రిప్‌.. | - | Sakshi
Sakshi News home page

హలీడే ట్రిప్‌..

May 17 2026 12:12 AM | Updated on May 17 2026 12:12 AM

హలో ఫ్రెండ్స్‌.. నా పేరు ధ్రువన్‌ తేజ్‌. ఐదో తరగతి చదువుతున్నా. మా కుటుంబం ఈ వేసవి సెలవుల్లో కర్ణాటక రాష్ట్రంలో టూర్‌కు వెళ్లాం. మొదటగా మైసూర్‌ ప్యాలెస్‌ చూశా. చాలా అద్భుతంగా ఉంది. అక్కడే

శ్రీచాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఆ తర్వాత కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌, ఓరొయానో మాల్‌ను చూశాను. ఈ ప్రదేశాలన్నీ చాలా బాగున్నాయి. నేను నా కుటుంబ సభ్యులం చాలా ఆనందంగా గడిపాం. అలాగే ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తూ చల్లగా ఉండే ఊటీకి వెళ్లాం. అక్కడకు వెళ్లగానే చల్లని

వాతావరణం చాలా.. చాలా నచ్చింది. అక్కడే రోజ్‌ గార్డెన్‌, చాక్‌లెట్‌ ఫ్యాక్టరీ కూడా చూశాం. రోజ్‌గార్డెన్‌ ఇంకా బాగా నచ్చింది. ఈ టూర్‌ని చాలా బాగా ఎంజాయ్‌ చేశాను. మీరు కూడా సెలవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని అనుకుంటున్నా. – సత్తుపల్లి టౌన్‌

Advertisement
 
Advertisement
Advertisement