●తరుగు తీస్తున్నారు సార్‌.. | - | Sakshi
Sakshi News home page

●తరుగు తీస్తున్నారు సార్‌..

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

●తరుగు తీస్తున్నారు సార్‌..

కూసుమంచి: యాసంగిలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కూసుమంచి మండలం పాలేరులో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈక్రమాన పలువురు రైతులు ధాన్యం తరలించేందుకు బస్తాకు రూ.5 వరకు వసూలు చేస్తున్నారని, మిల్లర్లు ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని వివరించారు. దీంతో స్పందించిన మంత్రులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ దివాకర, సీపీ సునీల్‌దత్‌ను ఆదేశించారు. లారీల రవాణా ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతులు ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని తెలిపారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీఓ శ్రీరామ్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ఎం.ఏ.అలీమ్‌, పౌర సరఫరాల సంస్థల ఇన్‌చార్జి డీఎం సునీల్‌రెడ్డి, డీసీఓ గంగాధర్‌, తహసీల్దార్‌ సైదులు, ఏడీఏ సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement