పులిగుండాల వెళ్లొద్దామా ?! | - | Sakshi
Sakshi News home page

పులిగుండాల వెళ్లొద్దామా ?!

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

ఎకో టూరిజంలో భాగంగా పెనుబల్లి మండలంలోని పులిగుండాల రిజర్వాయర్‌ వద్ద పర్యాటకుల కోసం వసతులు కల్పించారు. అక్కడ నిండా నీళ్లతో కళకళలాడే రిజర్వాయర్‌ను చూస్తూ రోజంతా గడపొచ్చు. అలాగే, అడవిలో షికారుకు సఫారీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సేద తీరేందుకు విడిది గృహాలు, అడవిని వీక్షించేలా వాచ్‌టవర్‌ కూడా నిర్మించారు. ఈ క్రమాన పులిగుండాల టూరిజంప్రాజెక్టుపై ప్రచారం కోసం వాటర్‌ ఫాల్స్‌, వివిధ జంతువుల బొమ్మలతో కూడిన ప్రాజెక్టు నమూనాను కలెక్టరేట్‌ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని చూస్తే చాలు సెలవుల్లో ఒకరోజు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలనే ఆసక్తి కలగడం ఖాయమని చెబుతున్నారు.

– ఖమ్మంమయూరిసెంటర్‌

కాఫీ టేబుల్‌ బుక్‌ ఆవిష్కరణ

ఖమ్మంవ్యవసాయం: పులిగుండల ఎకో–టూరిజం ప్రాజెక్టు వివరాలతో రూపొందించిన ‘కాఫీ టేబుల్‌ బుక్‌’ను హైదరాబాద్‌లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డాక్టర్‌ సి.సువర్ణ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పులిగుండాలను పరిరక్షణ, పర్యాటకం, పర్యావరణ విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దడంలో పూర్వ డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌, ఉద్యోగుల కృషిని అభినందనీయమన్నారు. అలాగే, పుస్తక రూపకల్పనపై విక్రమ్‌సింగ్‌ను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement