ఒకప్పుడు తిరుమలాయపాలెం మండలంలో చుక్కనీరు లేక చెరువులు నెర్రెలు బారి కనిపించేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. మండలంలోని పలు చెరువులు మండు వేసవిలోనూ జలకళ సంతరించుకుని కనిపిస్తున్నాయి. వచ్చే ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా
ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జలవనరుల శాఖ అధికారులు
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేసి చెరువులను నింపారు. దీంతో దాదాపు అన్ని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. చెరువుల్లో నీరు పుష్కలంగా
ఉండడంతో భూగర్భ జాలలు కూడా భారీగా పెరిగిన నేపథ్యాన వర్షాకాలంలో వానలు
ఆలస్యమైనా సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. – తిరుమలాయపాలెం


