ఖమ్మంసహకారనగర్/ఖమ్మంవైద్యవిభాగం: రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా శాఖల వారీగా కేటాయించిన సభ్యత్వాలు నమోదు చేయించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన కలెక్టరేట్‌లో సభ్యత్వాలపై సమీక్షించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉద్యోగులు సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే రెడ్‌క్రాస్ సొసైటీలో జిల్లా నుంచి కనీసం వేయి మంది ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి
ఖమ్మంసహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 నాటి జాబితాతో మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీసీ ద్వారా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌పై సమీక్షించారు. రానున్న 15 రోజుల్లో 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేసేలా ఉద్యోగులకు సూచనలు చేయాలని తెలిపారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జిల్లాలో మ్యాపింగ్ 42 శాతం పూర్తయిందని, మరింత వేగం పెరిగేలా చూస్తామని వివరించారు. ఇంకా ఈ వీసీలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీఎస్


