రామయ్యకు సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

May 11 2026 7:26 AM | Updated on May 11 2026 7:26 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూ లమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

అంజన్నకు రామయ్య పట్టు వస్త్రాలు..

భద్రాచలంటౌన్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి వారికి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయ ఈఓ కే. దామోదర్‌ రావు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఏఐయూకేఎస్‌ జాతీయ మహాసభలు

ఇల్లెందురూరల్‌: ఏఐయూకేఎస్‌ జాతీయ ప్రథ మ మహాసభలు ఈనెల 11, 12, 13 తేదీలలో ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్‌ రంగయ్య తెలిపారు. ఇల్లెందులో ఆది వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. మొదటి రోజు సాయంత్రం ఇల్లెందు జేకే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల తీరు వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలులో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు. మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement