రూ.200 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

రూ.200 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానం

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

పనులు పూర్తి చేసేందుకు 30 నెలల గడువు

భద్రగిరి రామాలయ

అభివృద్ధి పనుల్లో ముందడుగు

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఆలయ అభివృద్ధికి మూడు దశల్లో రూ. 351 కోట్లను కేటాయించిన సంగతి విదితమే. ఇందులో కీలకమైన టెండర్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో పనులకు రంగం సిద్ధం చేశారు. సుమారు రూ.200 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనుల జాబితా సిద్ధంచేసి ఈనెల 9న టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 15వరకు సివిల్‌ పనులకు గడువు విధించారు. ఆతర్వాత పరిశీలించి ఖరారు చేస్తారు.

భవనాల తొలగింపునకు సుమారు రూ.5 కోట్లు

అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న భవనాలను కూల్చివేసి, వాటి శిఽథిలాలను తొలగించే పనులకు రూ.4,97,64,000కు టెండరు పిలిచారు. మొత్తం 1,058 నిర్మాణ పనులకు రూ.200 కోట్ల 89 వేలుగా ప్రతిపాదించారు. కాగా ఈ పనుల పూర్తికి 30 నెలల గడువు విధించారు. వచ్చే మార్చి నాటికి ఆలయ ప్రాంగణంలో పనులను పూర్తి చేసి గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే టెండర్‌ ప్రక్రియలో రెండున్నరేళ్ల గడువు విధించడంతో పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement