ప్రతీ ఓటమి గెలుపునకు నాంది | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఓటమి గెలుపునకు నాంది

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

ఖమ్మంసహకారనగర్‌: ఓటమితో కుంగిపోకుండా గెలుపునకు నాందిగా భావించి ముందుకు సాఘాలని డీఈఓ చైతన్యజైనీ సూచించారు. పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం కూసుమంచి, సత్తుపల్లి, శాంతినగర్‌, ఎన్‌ఎస్‌సీ కాలనీ, మధిర పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. కూసుమంచి ఉన్నత పాఠశాలలో క్యాంప్‌ను మంగళవారం డీఈఓ ప్రారంభించి మాట్లాడుతూ.. అందరి జీవితంలో జయాపజయాలు ఉంటాయని తెలిపారు. ప్రతీ ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని కారణాలు విశ్లేషించుకుంటూ ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. ఆ తర్వాత సాంస్కృతిక, క్రీడాంశాల్లో శిక్షణకు ఏర్పాటు చేసిన క్యాంప్‌ను కూడా డీఈఓ పరిశీలించారు. ఏఎంఓ పి.ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ వీరస్వామి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement