ఖమ్మంస్పోర్ట్స్: నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా సీహెచ్.దీప్తి, చీఫ్ ప్యాట్రన్‌గా రామసహాయం పార్వతీరెడ్డి, చైర్మన్‌గా డాక్టర్ రవికుమార్, కార్యదర్శిగా ఎన్.ఫణికుమార్ ఎన్నికయ్యారు. ఈ కమిటీ నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం పార్వతీరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నెట్‌బాల్ అభివృద్ధికి కృషి చేయడమే కాక జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగేలా తర్ఫీదు ఇప్పిస్తామని వెల్లడించారు.
ఐకేపీలో ఆగడాలపై
మహిళల ఫిర్యాదు
పొట్టేళ్ల దాడిలో
గాయపడిన కాపరి మృతి
పెనబల్లి: పొట్టేళ్లు పోట్లాడుకుంటుంటే విడదీసే యత్నంలో గాయపడిన జీవాల కాపరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెనుబల్లి మండలం ఉప్పలచిలకకు చెందిన చిల్లిముంత కుటుంబరావు(50) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10వ తేదీన మందను తీసుకెళ్లే క్రమాన మందలోని రెండు పొట్టేలు పోట్లాడుకుంటుంటే విడదీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు ఆయనకు పెనుబల్లి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించినా పరిస్థితి మెరుగపడక వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు వీఎం.బంజర ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు.


