భగ్గుమంటున్న భానుడు | - | Sakshi
Sakshi News home page

భగ్గుమంటున్న భానుడు

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

ఖమ్మంవ్యవసాయం: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారడంతో జనం అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రత 40–45 డిగ్రీల మధ్య నమోదవుతోంది. శుక్రవారం కూడా గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఎండ తీవ్రతకు వడదెబ్బ మరణాలు సంభవిస్తుండగా, పశుపక్షాదులు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ ఎండకు తోడు వడగాలులతో జనం బయటకు వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఎండ ప్రభావం కారనంగా రైతులు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు అవస్థ పడుతున్నారు.

తిమ్మారావుపేటలో గరిష్టం

జిల్లాలోని ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో శుక్రవారం గరిష్టంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, గౌరారం, బాణాపురంలో 43.8, పమ్మిలో 43.7, రావినూతలలో 43.6, గుబ్బగుర్తిలో 43.5, సిరిపురం, కలెక్టరేట్‌, ఏన్కూరులో 43.2, వైరాలో 43, మధిరలో 42.9, వైరా ఏఆర్‌ఎస్‌లో 42.7, నాగులవంచలో 42.6, తల్లాడలో 42.5, ఖానాపురంలో 42.4, చింతకాని, కుర్నవల్లిలో 42.3, నేలకొండపల్లిలో 42.2, ఎర్రుపాలెంలో 42.1, ప్రకాష్‌నగర్‌, కొణిజర్లలో 42 డిగ్రీలుగా నమోదైంది. అంతేకాక ముదిగొండ, మధిర ఏఆర్‌ఎస్‌లో 41.9, కల్లూరులో 41.7, గేటు కారేపల్లిలో 41.5, పెద్దగోపతి, రఘునాథపాలెం, లింగాలలో 41.3, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్‌, బచ్చోడులో 41.1, సత్తుపల్లి, పంగిడిలో 41, సత్తుపల్లి ఓసీ, కూసుమంచిలో 40.9, కాకరవాయిలో 40.8, మంచుకొండలో 40.6, తిరుమలాయపాలెం, గాంగారంలో 40.5, వేంసూరు, సదాశివునిపాలెంలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి

Advertisement
 
Advertisement
Advertisement