ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏదులాపురం క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గ్రామానికే చెందిన కొండా అజిత్(26) మృతి చెందాడు. వ్యక్తిగత పనిపై అజిత్ వరంగల్ క్రాస్‌రోడ్డుకు వెళ్లి తిరిగి నడుస్తూ ఇంటికి వస్తున్నాడు. ఆయన రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టి ఆయన పైనుంచి వెళ్లడంతో మృతదేహం చిధ్రమైంది. అక్కడకు చేరుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, బృందం సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.


