మధిర: మధిరకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ రెంటపల్లి ఫ్రాన్సిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 2న జరిగిన కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 777 మందిని రికార్డుకు ఎంపిక చేయగా ఫ్రాన్సిస్‌కు స్థానం దక్కింది. ఈ మేరకు 8వ తేదీన విజయవాడలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు దండంగి అగస్టీన్ ఆయనకు రికార్డు పత్రం, పతకాన్ని బహూకరించారు.
హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: రామాంతపూర్, బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో మొదటి తరగతిలో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి జి.జ్యోతి తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించగా.. రామాంతపూర్, బేగంపేటలో ఒక్కో సీటు అందుబాటులో ఉందని వెల్లడించారు. వయస్సు, వార్షిక ఆదా యం ఆధారంగా అన్ని సర్టిఫికెట్లతో కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందించాలని సూచించారు. జిల్లా కోటా కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే జూన్ 1వ తేదీన లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.
ఆయిల్‌పామ్
సాగుతో లాభాలు
ఖమ్మంఅర్బన్: ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్‌పామ్ సాగు రైతులకు లాభదాయకంగా మారుతోందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాషా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బాలాపేటలోని పలువురు రైతుల ఆయిల్‌పామ్ క్షేత్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుచేస్తే తక్కువ నిర్వహణ ఖర్చు లతో అధిక ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు. శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎంవీ మధుసూదన్, పట్టు పరిశ్రమశాఖ డీడీ ముత్యాలు, రైతులు మానుకొండ రాధాకిశోర్, కుర్ర సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


