కరకగూడెం: ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లలో ఒకరు ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ కాలం గడిపేవాడు. మరొకరు ప్రతిరోజూ కొంత సమయం చదువు, కొంత సమయం ఆటలకు, ఇంకొంత సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించేవాడు. కాలం గడిచింది. మొబైల్‌తో సమయం వృథా చేసిన బాలుడు చదువులో వెనుకబడిపోయాడు. కానీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్న బాలుడు చదువులోనే కాదు ఆటల్లోనూ, చిత్రలేఖనంలోనూ ప్రతిభ చూపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఒకరోజు మొబైల్‌కు బానిసైన బాలుడు తన స్నేహితుడిని అడిగాడు. ‘నువ్వు ఎలా విజయవంతమయ్యావు?’అని. అప్పుడు ఆ విద్యార్థి ‘మొబైల్ మనకు ఉపయోగపడాలి. మనమే మొబైల్‌కు బానిసలు కాకూడదు’అని చెప్పాడు. ఆ మాటలు విని మొదటి విద్యార్థి ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు నుంచి మొబైల్ వినియోగాన్ని తగ్గించి, స్నేహితులతో కలిసి బయట ఆటలు ఆడడమే కాక పుస్తకాలు చదవడం ప్రారంభించాడు.
అమ్మమ్మ
చెప్పిన
నీతి కథ


