మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి

May 17 2026 12:12 AM | Updated on May 17 2026 12:12 AM

ఖమ్మంమామిళ్లగూడెం: మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఖమ్మంలో శనివారం జరిగిన సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కులస్తులు ఐక్యంగా ఉంటూ అందరి సంక్షేమానికి పాటుపడాలని తెలిపారు.

జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రం

సంఘం సమావేశంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికవగా, ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి దేవేంద్రం, కోశాధికారిగా మడూరి పూర్ణచంద్రరావు, గౌరవ అధ్యక్షుడిగా కొత్త సీతారాములు ఎన్నికయ్యారు. అలాగే, యువజన విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తోట రమేష్‌, మాటేటి కిరణ్‌ కుమార్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పగడాల మంజుల, తోట సుజలారాణిని ఎన్నుకోగా ఎంపీ రవిచంద్ర సత్కరించారు. ఇంకా ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, నాయకులు గుండాల కృష్ణ, కొత్తా సీతారాములు, మేకల భిక్షమయ్య, కనకం జనార్దన్‌, పొదిల రవికుమార్‌, శెట్టి రంగారావు, లక్కినేని రఘు, గీతా వెంకన్న, పొన్నం వెంకటేశ్వర్లు, బచ్చు విజయ్‌కుమార్‌, జాబిశెట్టి శ్రీనివాసరావు, ఆళ్ల కృష్ణ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, తోట గణేష్‌, తోట రామారావు, మాటి నాగేశ్వరరావు, తోట వీరభద్రం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement