729 మందికి ఇళ్లు నిర్మించాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

729 మందికి ఇళ్లు నిర్మించాల్సిందే..

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం వెలుగుమట్ల గుట్టపై కూల్చివేతలతో సర్వం కోల్పోయిన 729మంది బాధితులకు అక్కడే ఇళ్లు నిర్మించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మం టీటీడీసీ హాల్‌లో గురువారం కె.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితుల తరఫున చేపట్టిన ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం 311 మందికి పట్టాలు ఇచ్చిందన్నారు. అయితే, మరో 101 మందికి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ఇంకో 317 మందిని అనర్హులుగా ప్రకటించడం సరికాదన్నారు. ఇళ్లు కోల్పోయిన 729 మందికి వెలుగుమట్లలోనే పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు మాట్లాడుతూ.. భూదాన్‌ భూమిలో కార్యాలయాల నిర్మాణ ఆలోచనను విరమించుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో బాధితుల కమిటీ కన్వీనర్‌ ఉదయ్‌తో అమిత్‌, నవ్య, పాషా, బండి నాగేశ్వరరావు, మేడి బసవయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement