ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లో ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాల్లో భాగంగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు రామకృష్ణ, పెసర ప్రభాకర్‌రెడ్డి, రూబీ, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్యామ్‌సన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన డీఈఓ
నేలకొండపల్లి: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపి న విద్యార్థులు సొంతంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించిన డీఈఓ చైతన్య జైనీ ఆ మాట నెరవేర్చారు. నేలకొండపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయాన సొంత నిధులతో అల్పాహారం సమకూర్చారు. అప్పట్లో మండల స్థాయి అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరికి సైకిళ్లు ఇస్తానని తెలిపారు. ఈమేరకు 564మార్కులు సాధించిన చిట్టెంశెట్టి మహేష్, 537మార్కులు సాధించిన మోత్కూరి రక్షితకు శుక్రవారం సైకిళ్లు అందించడమే కాక మహేష్ ఉన్నత చదువుకు సహకరిస్తానని చెప్పారు. ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్‌ఎం గోపగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ చైతన్య జైనీ


