చేపలు, రొయ్యల పెంపకానికి చెరువులే కీలకం | - | Sakshi
Sakshi News home page

చేపలు, రొయ్యల పెంపకానికి చెరువులే కీలకం

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

కల్లూరు: చేపలు, రొయ్యల పెంచే వారు చెరువుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్‌ సూచించారు. కల్లూరు రైతు వేదికలో మత్స్యశాఖ, జలవనరుల శాఖల ఆధ్వర్యాన మత్స్యకారులకు శుక్రవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, లేనిపక్షంలో నీటి నాణ్యత తగ్గి చేపల ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈమేరకు జాగ్రత్తలు పాటించాలని తెలిపా రు. జలవనరుల శాఖ ఈఈ సురేష్‌బాబు, డీఈ ఈలు వెంకటేశ్వరరావు, రాజారత్నం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement