మోత మోగింది.. | - | Sakshi
Sakshi News home page

మోత మోగింది..

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

జిల్లాలో రోజుకు 8 లక్షల లీటర్ల

వినియోగం

ఫలితంగా వాహనదారులపై

రూ.24 లక్షలకు మించి భారం

భారం మోపారు..

ఖమ్మంసహకారనగర్‌: అందరూ భావిస్తున్నట్లుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఇరవై రోజుల క్రితం పెట్రోల్‌, డీజిల్‌కు ఇక్కట్లు వచ్చినప్పుడే ధరల పెంపునకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీన్ని నిజం చేసేలా శుక్రవారం ఉదయం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినట్లు బంక్‌ల నిర్వాహకులు ప్రకటించారు. దీంతో విషయం తెలియక బంక్‌లకు వచ్చిన వినియోగదారులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

223 బంక్‌లు, 8 లక్షల లీటర్ల వినియోగం

జిల్లాలో అన్ని కంపెనీలవి కలిపి 223 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు పెట్రోల్‌ 3 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతాయి. అంతేకాక డీజిల్‌ సుమారు 5 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. ప్రస్తుతం పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.107.94 ఉండగా రూ.3.39 పెంపుతో రూ.111.33కు చేరింది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర రూ.96.13 ఉండగా, రూ.3.27 పెంపుతో రూ.99.13కి పెరిగింది. 2022 అక్టోబర్‌ తర్వాత ధరలు పెరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఈ పెంపుతో రోజుకు పెట్రోల్‌ వినియోగదారులపై సుమారు రూ.9 లక్షలకు పైగా, డీజిల్‌ వాహనదారులకు రూ.15 లక్షలకు మించి అదనపు భారం పడనుంది.

సామాన్యుల జీవితాలపై భారం

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం, రవాణా ఖర్చులు అధికమవడం వంటి కారణాలతో ఇంధన ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పెంపుదల ప్రజల జీవనంపై నేరుగా పడనుంది. ముఖ్యంగా ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డీజిల్‌ ధరలు పెరగడంతో సరుకు రవాణా ఖర్చులు అధికమై.. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక పెట్రోల్‌ ధర పెరిగిన కారణంగా ఉద్యోగులు, చిరువ్యాపారుల నెలవారీ ప్రయాణ ఖర్చుల్లో తేడా రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు, మోటార్లు నిర్వహించే రైతులు కూడా ధరల పెంపుతో ఇబ్బంది పడనున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటర్‌పై రూ.3కు పైగా పెంపు

కొద్దిరోజులు పెట్రోల్‌ దొరక్క ఇబ్బందులు పడ్డాం. ఆ సమస్య తీరిందనుకునేలోపే ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారు. ఇప్పటికే జీవనవ్యయం పెరిగి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇంతలోనే లీటర్‌ పెట్రోల్‌ పై రూ.3కు పైగా పెంచడంతో మరింత భారం పడనుంది.

–మొక్క సురేశ్‌, వాహనదారుడు, ఖమ్మం

Advertisement
 
Advertisement
Advertisement