దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్‌లో చిక్కుకున్న బాడీ బిల్డర్ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్ ట్రైనర్ దిలీప్ (28)కు, రోజూ జిమ్‌కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది.
అతడు బాడీబిల్డర్‌గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించిందని దిలీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్ ఆమెకు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్‌స్టాలో మెసేజ్ చేసింది. కానీ అంతలోనే దిలీప్ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబీకులు డిమాండ్ చేశారు.


