ఖాకీ కుటుంబంలో హనీ ట్రాప్‌ చిచ్చు! | Honey Trap police officer in Dharmavaram Police Sub Division | Sakshi
Sakshi News home page

ఖాకీ కుటుంబంలో హనీ ట్రాప్‌ చిచ్చు!

Apr 25 2026 4:01 AM | Updated on Apr 25 2026 4:01 AM

Honey Trap police officer in Dharmavaram Police Sub Division

పోలీస్‌ అధికారిని ట్రాప్‌ చేసిన దళారులు

అధికారితో మహిళలు అశ్లీలంగా ఉన్న వీడియోలతో రూ.లక్షల్లో వసూలు

ఆపై పోలీస్‌ అధికారి భార్యకు వీడియోలు పంపి కుటుంబంలో కలహాల సృష్టి

ఆలస్యంగా వెలుగుచూస్తున్న నిజాలు

ధర్మవరం పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో విస్తృతంగా  చర్చ

రహస్యంగా విచారణ చేయిస్తున్న పోలీస్‌ బాస్‌

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్‌ కేసు తరహాలోనే శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ఏకంగా ఓ పోలీస్‌ అధికారిపైనే వలపు వల విసిరి, డబ్బు వసూలు చేయడమే కా­కుండా, ఆయన కుటుంబంలోనూ చిచ్చు రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవ­హారంపై ధర్మవరం పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. విశ్వసనీ­యవర్గాల కథనం ప్రకారం.. ధర్మవరం పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉండే ఓ పోలీస్‌ అధికారి భార్య నెల రోజు­ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. 

పోలీస్‌ అధికారి కుటుంబ వ్యవహారం కావడంతో ఈ విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆత్మహ­త్య­కు కారణం అనారో­గ్యమని పైకి చెప్పి­నప్పటికీ, వాస్త­వాలు మాత్రం వేరే ఉన్నాయని ప్రచారం సాగు­తోంది. ఆ పోలీస్‌ అధికారికి మద­నపల్లె నియోజ­కవర్గం పరిధిలోని ఓ సచి­వాలయంలో పని చేసే ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. దీనికితోడు ధర్మ­వ­రానికి చెందిన కొంతమంది దళారులు, చేనేత వ్యాపా­రులతో ఆ పోలీస్‌ అధికారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

వారు తమ పనులు చేయించుకునే క్రమంలో ఆ అధికారికి అందమైన అమ్మాయిలను ఎర­గా వేసి వారి చెప్పు చేతల్లోకి తీసుకు­న్నట్లు సమాచారం. సచివాలయం ఉద్యోగి­నితో వివాహేతర సంబంధం విషయం కూడా తెలియడంతో వారు ఆయన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టు­కున్నారు. అప్పు రూపంలో అంటూ  రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశారు. కొంత కాలం తర్వాత పోలీసు అధికారి తన డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో సమస్యలు మొదలయ్యాయి. డబ్బులు అడుగుతావా అంటూ వారు పోలీసు అధికారికి సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను భార్యకు పంపించారు. దీంతో ఇంట్లో గొడవలు మొదల­య్యాయి. 

తన భర్త  వేరే మహిళలతో ఉన్న వీడియో­లు చూసిన భార్య తీవ్ర డిప్రెషన్‌కు గురైంది. ఆ క్రమంలోనే ఆమె మృతిచెందింది. మృతిౖ­పెనా స్థాని­కుల్లో అనుమానాలు ఉన్నా­యి. మృతదేహాన్ని చూడటానికి వెళ్లి­నప్పుడు బంధువులు పోలీస్‌ అధికారిని నిలదీసి­నప్పటికీ, ఫిర్యాదు­లో మాత్రం అనారో­గ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై పోలీస్‌ బాస్‌ రహస్య విచారణ జరిపించి, నివేదికను తెప్పించుకు­న్నట్లు విశ్వసనీ­యవర్గాల సమా­చారం. హనీట్రాప్‌ మూలాలు ఉండడంతో సమగ్ర దర్యా­ప్తు చేస్తున్నట్లు తెలిసింది. తొందర్లోనే నిజానిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement