ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గట్టుప్పల్: ప్రభుత్వ వసతి గృహం (హాస్టల్)లో ఉండటం ఇష్టం లేక పురుగు మందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట న నల్లగొండ జిల్లా అంతంపేట గ్రామంలో శనివారం జరిగింది. ఆదివారం పోలీసులు, గ్రా మస్తులు వివరాలు తెలిపారు. అంతంపేట గ్రా మానికి చెందిçన వీరమళ్ల వెంకటయ్యకు ముగ్గురు కుమార్తెలు.
పెద్ద కుమార్తె వివాహం చేయగా.. రెండో కుమార్తె నవ్య (15) నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. కొంతకాలంగా అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలైంది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన నవ్య తిరిగి హాస్టల్ వెళ్లడం ఇష్టం లేక శనివారం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.


