మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి | Minor girl dies Mother files complaint against her second husband | Sakshi
Sakshi News home page

మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి

Apr 5 2026 11:09 PM | Updated on Apr 5 2026 11:09 PM

Minor girl dies Mother files complaint against her second husband

సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement