టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో క్రికెటర్ ఆత్మహత్య | women cricket Ends Life In Chennai | Sakshi
Sakshi News home page

టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో క్రికెటర్ ఆత్మహత్య

May 1 2026 9:38 AM | Updated on May 1 2026 9:38 AM

women cricket Ends Life In Chennai

సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో శిక్షణ పొందుతున్న క్రికెటర్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన కాశ్మీర్‌ కుమార్‌ చెన్నైలో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతని కుమార్తె ఏంజెల్‌ కంగావి (19) పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. 

ఆమె టీ20 జట్టులో చోటుకోసం ప్రయత్నించింది. ఎంపిక కాకపోవడంతో మనస్తాపం చెందింది. బుధ­వారం రాత్రి ప్రాక్టీస్‌ ముగించుకుని ఇంటికి వచ్చిన ఏంజెల్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో ‘చాలా కాలంగా నా జీవితాన్ని దేవుడే రాశాడు. నా చావుకు నేనే కారణం. నేను ఇతరులను నిందించాలనుకోవడం లేదు. అమ్మా, నాన్నా మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు’ అని రాసి ఉంది.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement