రమేశ్ (ఫైల్)
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్దికి చెందిన కొమ్మెట రమేశ్(32) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఐదు రోజులపాటు బాగానే ఉన్న రమేశ్.. సోమవారం ఉదయం చనిపోతున్నాను సారీ అంటూ సోదరులు చంద్రమోహన్, కిట్టులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టాడు. ఆందోళనకు గురైన వారు రమేశ్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు.
ఆయన కోసం గాలించగా, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో సరైన ఉపాధి లభించక కుటుంబపోషణకు అప్పులు చేశాడని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు చంద్రమోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిందం గణేశ్ తెలిపారు.


