ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి | Telangana Horror, Father Ends His Two Sons Lives And Ends His Life In Mahabubabad, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Apr 28 2026 11:57 AM | Updated on Apr 28 2026 12:09 PM

 Father Commits Suicide After Ends Life Two Children

మహబూబాబాద్: తొర్రూర్ పట్టణ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి వలి  తన ఇద్దరు కుమారులు విలాస్‌ (5), వికేష్‌ (3)లను పోలంలోకి తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అదే చోట తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  

ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement