సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్లోని మల్లికార్జున నగర్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 23 నుంచి శ్రీకాంత్ విధులకు హాజరుకాలేదు. దీంతో విధులకు హాజరుకావాలని పీఎస్ నుంచి శ్రీకాంత్కు నోటీసులు వచ్చాయి.
ఈ క్రమంలో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహచరుల వాంగ్మూలాలు సేకరిస్తున్న పోలీసులు.. ఆర్థిక ఒత్తిడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.


