అధికారి ఆత్మహత్య కేసు.. | Ex Punjab Minister Laljit Singh Bhullar Arrested | Sakshi
Sakshi News home page

అధికారి ఆత్మహత్య కేసు..

Mar 24 2026 4:52 AM | Updated on Mar 24 2026 6:21 AM

Ex Punjab Minister Laljit Singh Bhullar Arrested

పంజాబ్‌ మాజీ మంత్రి భుల్ల్లర్‌ అరెస్ట్‌

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారి ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి లాల్జిత్‌ సింగ్‌ భుల్ల్లర్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఫతేగఢ్‌ సాహిబ్‌ జిల్లా మండి గోబింద్‌గఢ్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నామని, అ మృత్‌సర్‌ కోర్టులో మంగళవారం హాజరు పరు స్తామని పోలీసులు తెలిపారు. అమృత్‌సర్‌ జిల్లా వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ అయిన గగన్‌ దీప్‌ సింగ్‌ రణ్‌ధావా శనివారం ఉదయం విషం తీసుకుని, బలవన్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. తన మరణానికి మంత్రి భుల్లర్‌ కారణమని ఆయన ఆరోపించారు. 

ఓ టెండర్‌ను తండ్రి సుఖ్‌దేవ్‌ సింగ్‌ భుల్ల్లర్‌కు వచ్చేలా చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారని తెలిపారు. అలా చేయకపోవడంతో రూ.10 లక్షలు లంచం తీసుకుని వేరే వ్యక్తికి ఇచ్చినట్లు ఒప్పుకోవాలంటూ తుపాకీతో బెదిరించారని ఆ వీడియోలో తెలిపారు. ఈ ఘటనతో సీఎం మాన్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, సీఎం మాన్‌ మంత్రి భుల్లర్‌ను తప్పుకోవాలని ఆదేశించడం, ఆయన రాజీనామా చేయడం జరిగిపోయాయి. భుల్ల్లర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. పార్లమెంట్‌లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్‌ పోలీసులు భుల్లర్‌ను అరెస్ట్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement