భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత! | Chennai Man Assassinates Instagram Influencer Wife, Then Ends His Life | Sakshi
Sakshi News home page

భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!

Apr 30 2026 11:51 AM | Updated on May 2 2026 6:46 PM

Chennai Man Assassinates Instagram Influencer Wife, Then Ends His Life

సాక్షి, చెన్నై: చెన్నైలోని నంగనల్లూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భార్య, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదుగుదలను  ఓర్వకోలేక, ఆమె భర్తే దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 27న వారి చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, మృతులను సుబ్రమణియన్ (52), అతని భార్య నాగలక్ష్మి (42)గా గుర్తించారు. కుటుంబ కలహాలు, మనస్పర్థల కారణంగా వీరి కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. సుబ్రమణియన్ మధురైలోని తన బంధువుల ఇంట్లో  ఉంటున్నాడు. మరోవైపు నాగలక్ష్మి చెన్నైలో ఉంటూనే స్వతంత్రంగా జీవిస్తోంది. 

 భర్తతో విభేదాల నేపథ్యంలో తనకాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో, నాగలక్ష్మి 'శ్రీ సాయి సిల్క్స్' పేరుతో చీరల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఫలితంగా వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో నంగనల్లూరులో పెద్ద స్టోర్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాదు  పెద్ద కుమారుడు హరీష్ భరద్వాజ్ (21)ను రష్యాలో మెడిసిన్ చదివిస్తుండగా, చిన్న కుమారుడు శైలాష్ (18) చెన్నైలో డెంటిస్ట్రీ  మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

అయితే  ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చిన సుబ్రమణియన్ తాను మారిపోయానని, తన గత ప్రవర్తనకు క్షమాపణ చెప్పి నాగలక్ష్మితో రాజీపడినట్లు సమాచారం.  ఇంతలోనే ఇంత ఘోరానికి పాల్పడ్డాడు.

ఏప్రిల్ 27న సుబ్రమణియన్ తన చిన్న కుమారుడు శైలాష్‌కు ఒక ఆందోళనకరమైన మెసేజ్ పంపాడు. కంగారుగా ఇంటికి చేరుకున్న శైలాష్‌కు తన తల్లి రక్తపు మడుగులో శవమై కనిపించింది. తండ్రి మరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. 

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

ఇదీ చదవండి: శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్‌ సంచలన హెచ్చరిక

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, దంపతుల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే సుబ్రమణియన్ తన భార్యను నరికి చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్‌
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement